ఫిబ్రవరి20 వ తేదీ రాత్రి బట్టుపల్లి రోడ్ అమ్మవారిపేట క్రాస్ రోడ్ వద్ద సుమంత్ రెడ్డి అనే డాక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తమ అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలసి భర్తను చంపాలని భార్య పథకం వేసినట్లు గుర్తించారు. వారికి స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు. ఏసీపీ వరంగల్ నందిరామ్ నాయక్ కథనం ప్రకారం.. డాక్టర్ సుమంత్ రెడ్డి 2016 సంవత్సరంలో ఫ్లోరా మరియా అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2018 సంవత్సరంలో సుమంత్ రెడ్డి సంగారెడ్డి పీహెచ్‌సీలో కాంట్రాక్ట్ పద్దతిన మెడికల్ ఆఫీసర్ గా పనిచేశాడు. ఫ్లోర సెయింట్ అంథోని స్కూల్ లో ఫ్లోరా మరియా టీచర్ గా పని చేసింది. పిల్లలు కావడం లేదని ఫ్లోరా మరియా డాక్టర్‌ను కలిసింది. థైరాయిడ్ సమస్య కారంగా పిల్లలు పుట్టడంలేదని.. ఫిట్నెస్ సెంటరుకు వెళ్లి వ్యాయామం చేయమని ఫ్లోరా మరియాకు డాక్టర్ సలహా ఇచ్చారు.
READ MORE: Joe Root: ఓటమి అంటే ఆ మాత్రం బాధ ఉంటది! స్టేడియంలోనే ఏడ్చేసిన జో రూట్
డాక్టర్ సలహా ప్రకారం ఆమె సంగారెడ్డి లోని సిద్దుస్ జిమ్‌కి వెళ్ళింది. జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్న సామ్యూల్ ఫిన్నీ పరిచయమయ్యాడు. అలా ఇద్దరి మధ్య అక్రమసంబంధం ఏర్పడింది. వరంగల్‌లోని వాసవి కాలనీలో ఉంటూ సుమంత్ రెడ్డి ఖాజీపేట లో హాస్పిటల్ పెట్టుకున్నాడు. వరంగల్ రంగశాయిపేట సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఆమె పని చేస్తుండేది. కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక సామ్యూల్ తో ఫోన్ లు, వీడియో కాల్స్ మాట్లాడుతుండేది. తనభర్త లేని సమయంలో సామ్యూల్, ఫ్లోర ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలిసింది. ఆయన వారిద్దరినీ మందలించాడు. వారి అక్రమ సంబదానికి అడ్డుపడుతున్నాడని డాక్టర్‌ను ఎలాగైనా చంపాలని ఇద్దరూ కలిసి ప్లాన్ వేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పథకం వేసుకున్నారు.
READ MORE:Delhi Assembly: అసెంబ్లీలోకి బీజేపీ ప్రభుత్వం రానివ్వడం లేదు.. ఆప్ సంచలన ఆరోపణలు
తన భర్తను చంపడానికి ప్రియుడికి ఫ్లోరా మరియా సుపారి ఇచ్చింది. లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది. నిందితుడు కొంతడబ్బు వెచ్చించి మారణాయుధాలు కొనుగోలు చేశాడు. హత్యలో నేరుగా ఫ్లోరా మరియా ప్రియుడు సామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజు పాల్గొన్నారు. సుమంత్ రెడ్డి హాస్పిటల్ ముగించుకొని కార్‌లో ఇంటికి వెళ్తున్న సమయంలో సామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజు వెంబడించారు. బట్టుపల్లిశివారు చీకటి ప్రదేశంలోని ఒక బ్రిడ్జ్ వద్దకు చేరుకోగానే సుత్తితో కార్ వెనక ఇండికేటర్ పై కొట్టారు. ఆ శబ్దానికి అతడు కార్ కొద్దిగా ముందుకు వెళ్ళి ఆపి కార్ దిగాడు. ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తుండగా నిందితులు అనుకున్న ప్రకారం.. సుత్తితో దాడి చేశారు. ఈ దాడిలో డాక్టర్ ఎలాగోలా బయటపడ్డాడు. కాగా.. మర్డర్ సాఫీగా జరిగితే కానిస్టేబుల్ కు ఇళ్ళు కట్టిస్తామని ఫ్లోరా మరియా ఒప్పందం కుదుర్చుకుంది. సైబరాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు రాజు. హత్యాయత్నంకు ముందు డా. సుమంత్ రెడ్డి నుంచి ఫ్లోరా మరియా విడాకులు కోరింది. సుమంత్ విడాకులకు నిరాకరించడంతో మర్డర్ ప్లాన్ చేసింది.