NTV Telugu Site icon

Hyderabad CP: హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఆంక్షలు.. కారణమిదే..!

Cv Anand

Cv Anand

Hyderabad CP: హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

Read Also: Love Marriage: ఫ్రాన్స్ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన భారతీయ యువకుడు

సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ 28వరకు వరకు నెలరోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

Show comments