NTV Telugu Site icon

Spa Center : స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్

Maharastra

Maharastra

కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. భారత్ లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అమాయకమైన అమ్మాయిలను తమ వలలో వేసుకుని వారిని తీసుకు వచ్చి వ్యభిచార ముఠాలకు విక్రయించి అందినకాడికి డబ్బును దండుకుంటున్నారు.

Also Read : Shikhar Dhawan : సీరియల్స్ బాట పట్టిన క్రికెటర్.. టీమిండియాలో చోటు కోల్పోయిన గబ్బర్..

తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార రాకెట్ ముఠా గుట్టును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు మహిళలను రక్షించిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. థానే జిల్లాలోని కాషిమీరా ప్రాంతంలోని ఓ స్పా సెంటర్ పై ఆదివారం దాడులు నిర్వహించారు. అక్కడ స్పా సెంటర్ ముసుగులో మహిళలతో వ్యభిచారం నడిపిస్తున్నారని గుర్తించి.. ముగ్గురు మహిళలను రక్షించారు. అలాగే స్పా సెంటర్ నుంచి ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు.

Also Read : Golden Visa: యువ మహిళా పారిశ్రామిక వేత్తగా నటి కార్తిక నాయర్‌!

స్పా సెంటర్ నిర్వహిస్తున్న వారిలో ఒకరు అక్కడ పని చేస్తున్న మేనేజర్ కాగా.. మరో వ్యక్తి స్పీపర్ అని పోలీసులు తెలిపారు. వారిపై పలు భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని వివిధ సెక్షన్స్ తో పాటు ప్రివేన్షన్ ఆఫ్ ఇమ్మోర్టల్ ట్రాఫికింగ్ రెగ్యులేషన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు. స్పా సెంటర్ యజమానిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి పనులు చేస్తే కఠినంగా శిక్షిస్తామని థానే జిల్లా పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు స్పా సెంటర్ ను మూసివేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.