NTV Telugu Site icon

Wild Hearts Pub: వైల్డ్ హార్ట్ పబ్‌పై దాడులు.. పోలీసుల అదుపులో 17 మంది యువతులు..

Pub

Pub

Wild Hearts Pub: హైదరాబాద్‌ నగరంలోని చైతన్యపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ వైల్డ్ హార్ట్ పబ్‌ పై పోలీసులు శనివారం రాత్రి అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పబ్ యాజమాన్యం పలు నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. సమయాన్ని మించి పబ్‌ను యజమాన్యం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ముంబయి నుండి ప్రత్యేకంగా యువతులను రప్పించి, అభ్యంతరకరంగా నృత్యాలు చేయిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది.

కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అసభ్యకరమైన పనులు చేయించడం, వారిని అర్ధనగ్నంగా నృత్యాలు చేయించడంతో పాటు మితిమీరిన వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్న పబ్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో మొత్తం 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వివరాలను నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే పబ్ యజమానితో పాటు అక్కడ ఉన్న పలువురు కస్టమర్లను కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. చైతన్యపురి పోలీసులు పబ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో చైతన్యపూర్ ప్రాంతంలో తీవ్ర కలకలం ఏర్పడింది. నగరంలో ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

YouTube video player