NTV Telugu Site icon

Police Notice to Manchu Manoj: మంచు మనోజ్‌కు పోలీసుల నోటీసులు..! ఇక్కడి రావొద్దు..!

Police Notice To Manchu Man

Police Notice To Manchu Man

Police Notice to Manchu Manoj: మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు ఇంటి దగ్గర జరిగిన ఘటన పెద్ద చర్చగా మారగా.. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబటినట్టు కనిపిస్తోన్న సమయంలో.. మంచు మనోజ్‌ పర్యటన మరోసారి కాకరేపుతోంది.. అయితే, మంచు మనోజ్‌కు తాజాగా నోటీసులు జారీ చేశారు పోలీసులు.. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్‌ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్‌ నోటీసులు ఇచ్చారు.. మరోవైపు.. మంచు మనోజ్‌.. ఎంబీయూకి వస్తారన్న సమాచారంతో పోలీసులను మోహన్‌బాబు ఆశ్రయించారు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయనే విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉన్నారు.. అయితే, మోహన్ బాబు సమాచారం మేరకు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. వర్సిటీలో బౌన్సర్లను కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది..

Read Also: Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ

కాగా, తిరుపతి పర్యటనలో ఉన్న మంచు మనోజ్‌.. తాను మోహన్‌బాబు యూనివర్సిటీకి రానున్నట్టు.. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేశారు.. తన పర్యటనపై మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు మంచు మనోజ్‌.. మొదట తిరుపతిలోని బంధువుల నివాసానికి వెళ్లిన ఆయన.. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం నుంచి ర్యాలీగా.. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) క్యాంపస్‌కి వెళ్తారని.. అక్కడి నుంచి నారావారిపల్లెకు వెళ్తారని.. జల్లికట్టు కార్యక్రమానికి హాజరై.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారని.. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి MBU క్యాంపస్‌కి వెళ్తారని.. అనాథ శరణాలయాలను సందర్శిస్తారని మంచు మనోజ్‌ టీమ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది.. అయితే, పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. మనోజ్‌.. ఎంబీయూకి దూరంగా ఉంటారా? పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్తారా? అనేది ఉత్కంఠగా మారింది.. మరోవైపు, ఇప్పటికే తిరుపతి నుంచి నారావారిపల్లెకు వెళ్తోన్న సమయంలో ఎంబీయూ వరకు ర్యాలీగా వచ్చారు.. అయితే, పోలీసులను చూసి.. ఏదైనా పబ్లిక్‌ ఇష్యూ జరిగినా..? ఇంత మంది పోలీసులు ఉండరేమో అని వ్యాఖ్యానించారు.. అయితే, కోర్డు ఆర్డర్‌ ఉందని పోలీసులు చెప్పడంతో.. నాకు ఇవ్వండి అని అడిగిన మనోజ్‌కు ఆ ఆర్డర్‌కు సంబంధించిన కాపీని పోలీసులు అందజేశారు.. ఇక, నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్‌, మౌనిక దంపతులు.. మంత్రి నారా లోకేష్ ని కలిశారు.. అక్కడి నుంచి రంగంపేట చేరుకున్న జల్లికట్టు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.. ఆ తర్వాత వారి పర్యటనలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి మరి..

Show comments