Site icon NTV Telugu

IPL 2025: ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా..

Ipl 2025

Ipl 2025

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగిపోతోంది. క్రికెట్ లవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భారత క్రికెట్ బోర్డ్ సైతం ఫిక్సింగ్ వ్యవహారంపై ఐపీఎల్ లోని 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు 5 హాట్ ఫేవరేట్ టీమ్ ప్రాంచైజీలను కాంటాక్ట్ చేసినట్లు బీసీసీఐ ఆధారాలు సేకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

Also Read:Supreme Court: “వారం రోజుల్లో సమాధానం చెప్పాలి” వక్ఫ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు

ఆధారాలు ఇవ్వాలని పోలీసులు బీసీసీఐని కోరారు. ఐపీఎల్ మ్యాచుల్లో ఫిక్సింగ్ కి పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ హెచ్చరించింది. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐసీసీ, బీసీసీఐ, స్థానిక క్రికెట్ క్లబ్లతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కి చెందిన ఐదుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని సదరు వ్యాపారవేత్త కాంటాక్ట్ అయి ఉండొచ్చని అనుమానిస్తు్న్నారు.

Exit mobile version