Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు

  • మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు
  • మిట్టపల్లిలో వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Madanapalle

Madanapalle

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు పెంచారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీటీయం పంచాయతీ మిట్టపల్లిలో వైసీపీ నేత, సీటీయం సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త అక్కులప్ప ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. అక్కులప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటా చలపతిని పోలీసులు విచారిస్తున్నారు. మాధవరెడ్డి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని మాధవ రెడ్డి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అక్కులప్ప ఇంట్లో డాక్యుమెంట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అక్కులప్ప చెప్పిన సమాచారం ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Read Also: Accident: ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం, ఐదుగురికి తీవ్రగాయాలు