Site icon NTV Telugu

Eluru Agency: ఆ ఎమ్మెల్యేకు నక్సలైట్ల ముప్పు..? పోలీస్ శాఖ సూచనలు..

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 10 రోజులు ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని పోలీస్ శాఖ సూచనలు చేసింది. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు కూడా రావద్దని, ఫోన్ లో సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీ ప్రాంతం బుట్టాయగూడెం మండలం బర్రింకలపాడు గ్రామం ఎమ్మెల్యే నివాసం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

READ MORE: S Jaishankar: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మతోన్మాది.. ఘర్షణకు కారణం ఆయనే..

కాగా.. గత కొన్ని రోజులుగా సాగుతున్న వరుస ఎన్‌ కౌంటర్లలో భద్రతా దళాలదే పై చేయి అవుతుంది. రోజు ఏదో ఒకచోట జరుగుతున్న ఎన్‌ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. తాజాగా ఛత్తీస్‌ఘఢ్‌ బీజాపూర్‌ అడవులు మరోసారి ఎన్‌కౌంటర్‌ కాల్పులతో మారుమోగాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. నక్సల్స్‌, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పలు కొనసాగుతున్నాయి. కాగా నిన్న జరిగిన భీకర ఎన్‌ కౌంటర్‌ లో మావో సుప్రీం కమాండర్‌ నంబాల కేశవరావు సహా 27 మంది మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే.

READ MORE: Deputy CM Pawan Kalyan: సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదు‌.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version