Site icon NTV Telugu

Pawan Varahi Yatra: పవన్‌ కళ్యాణ్‌కు పోలీసుల ఝలక్‌.. విశాఖలో వారాహి యాత్రకు ఆంక్షలు

Varahi Yatra

Varahi Yatra

Pawan Varahi Yatra: విశాఖలో రేపటి నుంచి జనసేనాని పవన్‌కళ్యాణ్ చేపడతున్న వారాహియాత్రపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మూడో విడత వారాహి యాత్రకు పోలీసులు పలు నిబంధనలు విధించారు. కొన్ని షరతులతో యాత్రకు అనుమతులు జారీ చేశారు. నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని, ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా రావద్దని పోలీసులు షరతులు విధించారు. ఇదిలా ఉండగా.. విశాఖలోని జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

Also Read: Minister Amarnath: బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్

మరోవైపు భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యత అని పోలీసులు షరతులు విఝించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులు పెట్టిన షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. పవన్ కళ్యాణ్ పర్యటనల నేపథ్యంలో.. వారాహి విజయ యాత్రలో గజమాలలు వేయవద్దని జనసేన కార్యకర్తలకు సూచించింది. భద్రత కారణాలను నాయకులు, శ్రేణులు దృష్టిలో ఉంచుకోవాలని వెల్లడించింది.

Also Read: Pawan Kalyan: ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి.. పవన్‌ సూటి ప్రశ్న

విశాఖ నగరం వేదికగా మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను నాయకులు, శ్రేణులు పాటించాలని కోరుతున్నామన్నారు. ఇందులో భాగంగా వారాహి విజయ యాత్రలో, సభా వేదికల వద్దగాని క్రేన్లతో భారీ దండలు, గజమాలలు వేయడం లాంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టవద్దన్నారు. యాత్ర వెళ్లే మార్గంలో భారీ క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహన శ్రేణి సాఫీగా సాగడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ భద్రతకు భంగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సహకరించాలని జనసేన ట్విట్టర్ వేదికగా సూచించింది. మూడో విడత వారాహి యాత్ర 19వ తేదీ వరకు కొనసాగే అవకాశముంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసేన ప్రకటించింది.

 

Exit mobile version