NTV Telugu Site icon

Police Harassed : ఖాకీ అరాచకం.. ముస్లిం యువతిపై ఎస్సై దాడి

Police Harassed

Police Harassed

న్యాయ అన్యాయాలు చూడకుండా బస్ లోనేడ ముస్లిం యువతిపై ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటర జగిత్యాలలో చోటు చేసుకుంది. నిన్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ జరిగింది. బెజ్జంకి నుండి ముస్లిం అమ్మాయి షేక్. ఫర్హా (22 సం.లు), MBA విద్యార్థిని, ఆమె తల్లి ఆర్టీసీ బస్సులో జగిత్యాలకి వస్తున్నారు. కరీనంనగర్ లో ఒక మహిళ బస్సులోకి ఎక్కింది. తను కూడా జగిత్యాలకు వస్తుంది. షేక్ ఫర్హా, తన తల్లి ఇద్దరు కూర్చున్న సీటు వద్ద వెళ్లి ఖాళీగా ఉన్న మూడవ సీటులో కూర్చుంది. పదేపదే మరికొంత జరగమని అనడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఒకరికొకరు మాటలు అనుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళ వెనకి సీటులోకి వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వాళ్ల సీటు దగ్గరికి వచ్చి కూర్చుని, నా భర్త ఏస్సై. నేను నా భర్తకు ఫోన్ చేశాను. అతను వచ్చి మీ సంగతి చూస్తాడు అని బెదిరించింది. వారు జగిత్యాల బస్టాండులో దిగినంక మాట్లాడుకుందాం అని అన్నారు.

Also Read : Karnataka assembly elections Live Updates: కొనసాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

సినీ ఫక్కీలో ఎస్సై అనీల్ ఏంట్రీ

బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఏస్సై అనీల్, డ్యూటీ డ్రెస్ లో ఒక కానిస్టేబుల్ బస్సు ఆపాడు. బస్సులో ఎక్కి తన భార్యతో ఎవరు నీతో గొడవ పెట్టుకున్నవారని అసభ్యంగా మాట్లాడాడు. తన భార్య షేక్ ఫర్హా, ఆమె తల్లిని చూపించడంతో వారి దగ్గరికి వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ తీవ్రంగా బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడ్డ ముస్లిం అమ్మాయి తన ఫోన్ లో వీడియో చాట్ ఆన్ చేసి ఫ్రెండ్ నెంబర్ కి పెట్టింది. ఒక్కసారిగా కోపంతో రగిలిపోయిన అనీల్ ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు. ఆ అమ్మాయి జుట్టుపట్టి బస్సు నుండి బయటికి లాక్కొచ్చి కొట్టాడు. బూటు కాళ్లతో తన్నాడు. అనీల్ భార్య ఆ ముస్లిం తల్లి మీద చేయిచేసుకుంది. అక్కడ అంతమంది జనాలు ఉన్నా చూస్తున్నారే కానీ ఏవరూ ఆపలేదు. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి అనీల్ ని నిలదీసింది. దీంతో ఆ అమ్మాయి పగిలిన ఫోన్, బస్సు టికెట్లు, పర్సు లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. జగిత్యాల టౌన్ పోలీసు స్టేషనులో బాధితులు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి 12 గంటల వరకు వారు పోలీసు స్టేషను దగ్గర ఉన్నారు. కానీ ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. ఏస్సై అనీల్, కానిస్టేబుల్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

Show comments