Site icon NTV Telugu

Police Fine Electric Scooter Over Pollution Certificate: ఇదేం విచిత్రం.. ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పొల్యూషన్ ఫైన్

Kerala Police

Kerala Police

Police Fine Electric Scooter Over Pollution Certificate: పొల్యూషన్ తగ్గాలని, డిజిల్, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం తగ్గాలని ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కర్బన్ ఉద్గారాలు జీరో కాబట్టి పర్యారణానికి హితంగా ఉంటాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కొన్ని రాయితీలను కూడా కల్పిస్తున్నాయి. అయితే ఇలాంటి వాహనాల ద్వారా పొల్యూషన్ అనేది ఉండదు. కానీ కేరళ పోలీసులు మాత్రం ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూపీ) సర్టిఫికేట్ లేదని ఏకంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఫైన్ వేశారు. ఈ ఘటనపై నెటిజెన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

కేరళ పోలీసులు పొల్యూషన్ సర్టిఫికేట్ లేనందుకు ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానికి జరిమానా విధించారు. దీంతో కేరళ పోలీసులను నెటిజెన్లు ఏకి పారేస్తున్నారు. కేరళ పోలీసులను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మలప్పురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. మలప్పురం జిల్లా కరువరకుండు పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలంచెరి ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులు ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆపారు. వాహనానికి పీయూసీ సర్టిఫికేట్ లేదని రూ. 250 ఫైన్ విధించారు.

Read Also: Godse photo at Ganesh Visarjan: వినాయక నిమర్జనంలో నాథూరామ్ గాడ్సే ఫోటోలు

అయితే ఇది మెషిన్ లో ఏర్పడిన పొరపాటు కారణంగా వచ్చిందని పోలీసులు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపిన వ్యక్తి తన డ్రైవింగ్ లైసెన్స్ చూపలేదని.. పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో అతని వద్ద డ్రైవింగ్ లైసెన్సుకు సంబంధించి ఎలాంటి డాక్యమెంట్, లైసెన్స్ లేదని.. ఈ క్రమంలో అతనికి ఫైన్ వేస్తున్న సమయంలో అధికారి మెషిన్ ను తప్పుగా టైప్ చేయడంతో పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని జరిమానా విధించాల్సి వచ్చిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. అయితే జరిగిన తప్పును పోలీస్ అధికారులు గమనించలేకపోవడం గమనార్హం

Exit mobile version