తెలంగాణ పోలీస్ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సైబర్ నెరగాళ్లతోపాటు సోషల్ మీడియాలో పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాను ఉపయోగించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియా కేంద్రంగా నేరాలకు పాల్పడితే హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రకటనలు, తప్పుడు వ్యాఖ్యానాలు, ఆర్థిక నేరాలు చేసే వారిపై దృష్టి సారించనున్నది. పదేపదే నేరాలు చేస్తున్న వారిని గుర్తించి హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.