Site icon NTV Telugu

Uppal: అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు.. బుద్ధి చెప్పిన పోలీసులు

Uppal

Uppal

పుట్టిన రోజు ప్రతి ఒక్కరికి మధురమైన రోజు. స్పెషల్ డే రోజు తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదాలు, కేక్ కటింగ్స్, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, పార్టీలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అయితే ఇటీవల బర్త్ డే సెలబ్రేషన్స్ హద్దులు మీరుతున్నాయి. నడిరోడ్లపై కేక్ కట్ చేస్తూ యువకులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు రెక్కీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో యువకులు రోడ్డుపై బర్త్ డే వేడుకలు జరుపుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు.

Also Read:Alluri Seetharamaraju: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పెళ్లి బృందం ప్రాణాలు కాపాడిన బండరాయి

హైదరాబాద్ లో అర్థరాత్రిళ్ళు రోడ్లపై బర్త్ డే వేడుకలు జరుపుకోవడం కొత్త ట్రెండ్ గా మారింది. ఈ వేడుకలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. దీంతో పోలీసులు, రాత్రిళ్ళు ఇలా పుట్టిన రోజు సందర్భంగా రోడ్లపై కేక్ కట్ చేయడాలు, కేకలు పెట్టడాన్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. ఉప్పల్‌ల్లో అర్థరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.. మరోసారి రిపీట్ ఐతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకా మీదట బర్త్‌ డేలు రోడ్ల పై అర్థరాత్రిళ్ళు చేశారో.. బర్త్ డే సంగతి దేవుడెరుగు.. పుట్టినరోజు నాడే పోలీసులతో తన్నులు లేదా తిట్లు దండకం వినాల్సి వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త.

Exit mobile version