తెలంగాణ పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 28వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ నెల 28వ తేదిన నిర్వహింబడే పోలీస్ కానిస్టేబుళ్ళ రాత పరీక్షకు హజరవుతున్న అభ్యర్థులకు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేసారు.
అభ్యర్థులకు సూచనలు :
- పరీక్ష ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గం ల వరకు నిర్వహించబడుతుంది.
- అభ్యర్థులు ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రంను చూసుకొని సరైన సమయానికి చేరుకునేట్లు తగు రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి.
- అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాల్సి వుంటుంది.
- ఉదయం 10:00 గం. ల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయి, ఒక్క నిముషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోని అనుమతించరు.
- పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్ లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరాకుడదు.
- అభ్యర్థులు కేవలం టికెట్, పెతో మాత్రమే పరీక్ష గదికి తీసుకురావాల్సి వుంటుంది.
- అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి, లేనిచో పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో అన్ని వివరాలను సరి చూసుకోవాలి.
