NTV Telugu Site icon

Case against Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదు

Janasena Chief Pawan Kalyan

Janasena Chief Pawan Kalyan

Case against Pawan Kalyan : జగసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు రావడంతో ఆయనపై తాడేపల్లి పోలీసులు కేస్ బుక్ చేశారు. మోడీతో భేటీ అయిన తర్వాత రోజునే పవన్ కల్యాన్ పై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనమైంది. తెనాలి మారీస్ పేటకు చెందిన పి.శివకుమార్ అనే వ్యక్తి ఈ నెల ఇప్పటం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా.. పవన్ కల్యాణ్ కారణంగా ప్రమాదానికి గురయ్యానని కంప్లైంట్ ఇచ్చాడు. ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Read Also: APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు

ఐపీసీలోని 336 , 279 , రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ క్రింద కేసు నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ టీఎస్ 07 సీజీ 2345 కారు టాప్పై కూర్చొని ఉండగా.. మరికొందరు దానికి వేళాడుతూ కనిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు పై కూర్చొని పవన్‌ వెళ్లడాన్ని బూచీగా డ్రైవర్ రాష్‌ డ్రైవింగ్ పై కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారి పై ఆయన వాహన శ్రేణిని పలు వాహనాలు అనుసరించడం పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణా రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్న కారుపై కూర్చొని పవన్ ప్రయాణించారు. అందుకే ఆ కారుపై కూడా ఛలానా కూడా వేశారు.

Show comments