Viral Video: వీళ్లు నిజంగా సూపర్బ్ పోలీసులే.. స్కూటీపై వెంబడించి దొంగలను పట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Caught Thieves On Scooty: పోలీసులు, దొంగల ఛేజింగ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే వీటిని తరచూ మనం టీవీల్లో, సినిమాల్లో చూస్తూ ఉంటాం. పారిపోయే దొంగ హీరో అయితే దొరకడు, అదే పట్టుకునే పోలీస్ హీరో అయితే దొంగ ఇట్టే దొరికిపోతాడు. ఇదంతా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పట్టుకునే క్రమంలో పోలీసులు, దొంగల మధ్య జరిగే ఫైటింగ్, స్టంట్ లు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అయితే నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదే. దొంగతనం చేసి దొంగలు పారిపోయాక ఎప్పటికో కానీ మన పోలీసులు పట్టుకోరు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం పోలీసులు దొంగను పదంటే పదే నిమిషాలలో పట్టుకున్నారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దొంగలు ఖరీదైన బైక్ మీద వెళుతుంటే పోలీసులు వారిని స్కూటీపై వెంబడించి పట్టుకోవడం. నమ్మడానికి కొద్దిగా కష్టంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: RBI: వచ్చే నెలలో వాటి ధరలు తగ్గుతాయ్: ఆర్బీఐ గవర్నర్
Also Read
వివరాల్లోకి వెళ్తే.. వియాత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు ఏదో దొంగతనం చేస్తారు. దాంతో వారిని పోలీసులు వెంబడిస్తారు. ఈ క్రమంలో వారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక ఖరీదైన బైకి ఎక్కి వేగంగా వెళుతూ ఉంటారు. ఎంత స్పీడ్ తో వెళుతుంటారంటే కన్ను మూసి తెరిచే లోపే వారు కనిపించకుండా పోతారు. అయితే పోలీసులు మాత్రం తగ్గేదే లే అనుకున్నారు. ఎట్లాగైనా వారిని పట్టుకోవాలని అనుకున్నారు. అయితే వారికి పక్కనే ఓ స్కూటీ అందుబాటులో ఉండటంతో దానితో వారిని వెంబడిస్తారు. దొంగలది ఖరీదైన బైక్, పోలీసులది స్కూటీ ఇంకేముంది దొంగలు దొరికినట్లే అనుకున్నారు అందరూ. అయితే అందరి అంచనాలను తల కిందులు చేస్తూ ఆ దొంగలను పట్టేసుకున్నారు పోలీసులు. వేగంగా వెళ్లిన దొంగలు కిందపడిపోతారు. పోలీసులు వెంటనే వారిని పట్టుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో పోలీసుల వాహనం ముందు ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. దొంగలను పట్టుకున్న పోలీసులు వారికి బేడీలు వేసి తీసుకువెళ్లారు. అయితే ఇప్పటికే ఈ వీడియోలను మిలియన్ల మంది వీక్షించారు. చూసిన ప్రతి ఒక్కరు వీరు నిజంగా సూపర్బ్ పోలీసులు అంటూ కితాబిస్తున్నారు. ఇలాంటి పోలీసులు ఉంటే దొంగలు తప్పించుకోలేరని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Vietnamese Police Chasing Two Thieves pic.twitter.com/A1BtsycN8J
— Pepe Meme (@pepe_fgm) August 23, 2023
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!