Fake Baba: వరంగల్ లో ఓ కీచక బాబా బాగోతం బట్టబయలైంది. ఎట్టకేలకు ఆ ఫేక్ బాబాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఏనుమామూల ప్రాంతంలో షైక్నాలా లబ్బే అనే కీచక బాబాగా అవతరమెత్తాడు. మహిళ ఫిర్యాదుతో దొంగ బాబాను అరెస్టు చేశారు పోలీసులు.
Read Also: Free Aadhaar Update: ఆధార్ ఫ్రీ అప్‌డేట్.. చివరి గడువు రేపే! తర్వాత డబ్బులు కట్టాల్సిందే
వివరాల్లోకి వెళ్తే.. తన మంత్రశక్తులతో కుటుంబంలో ఏమైనా కలహాలు, భార్య భర్తల మద్య తగాధలు మరియు ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తా అని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబరుచుకున్నాడు. అంతేకాకుండా మాయమాటలు చెప్పి కామకోరికలు తీర్చుకునేవాడు. ఇంకా కీచక బాబా అరాచాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అయితే మరో వివాహితపై కన్నేసిన దొంగబాబా.. ఆమెకు తన భర్తతో ఉన్న విబేధాలను దృష్టిలో ఉంచుకొని, పూజలు చేస్తునట్టు నటించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read Also: CM YS Jagan: నా మనస్సు ఎప్పుడూ మీకు మంచి కోసమే ఆలోచిస్తుంది..
ఈ విషయాన్ని బాధిత మహిళ భయపడుతూనే ఆ విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో ఆమే కుటుంబ సభ్యులు బాధితురాలును వెంటబెట్టుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కీచకబాబా చీకటి యవ్వారం బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. కీచక బాబాని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. దొంగబాబ వివరాలను బయటపెట్టాడు. తాను తమిళనాడు చెందిన వ్యక్తిని అని, దాదాపు 40 సం. ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు పేర్కొన్నారు. తన పేరు షైక్నాలా లబ్బే వయసు : 58, కులం ముస్లిం, నివాసం ఉండే ప్రాంతం ఏనుమామూల అని వివరాలు పోలీసులకు తెలిపాడు. పోలీసులు కీచక బాబా దగ్గర నుండి మంత్రాలకు వాడే సామాగ్రి, తాయత్తులు, నిమ్మకాయలు, 25వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.