NTV Telugu Site icon

Car Theft : కారు కనిపిస్తే ఖతం.. చోరులందు వీరు వేరయా..!

Car Theft

Car Theft

Police arrested Cars Robbery Gang.

ఖరీదైన కార్లు వారి టార్గెట్ .. పార్క్ చేసిన కార్లు దొంగలించడం వాటిని దేశ రాజధాని దాటించి తెలంగాణ లో అమ్మేయడం .. అలా వచ్చిన లాభం లో తలాఇంత అని పంచుకొవడం ఇది ఈ ముఠా చేస్తున్న దందా .. దీంతో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ముగ్గరు నిందితులను అరెస్ట్ చేశారు.. ఢిల్లో లో చోరీ చేసిన 15 కార్లను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు .. కార్లు ను చోరీ చేసి హైదరాబాద్ లో అమ్మకాలు చేస్తున్న ముఠా ఆగడాలకు కళ్లెం వేశారు సైబరాబాద్ పోలీసులు . హైదరాబాద్ బండ్లగూడ , అత్తాపూర్ కి చెందిన ముగ్గురు ముఠా సభ్యులు చోరీ అయినా కారులు అమ్మకాలు చేస్తున్నారు. మహ్మద్ అజహర్ జావీద్ అనే వ్యక్తి ఇంటర్ వరకు చదివి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. దీంతో ఖత్తర్ లో వారి సోదరి సహాయంతో అక్కడ రెస్టారెంట్ స్టోర్ లో పని చేశాడు.. అక్కడ పని నచ్చకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత జావీద్ ఉద్యోగం కోసం వెతికాడు.. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు .. దీంతో సెకెండ్ హ్యాండిల్ లో కారులు కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తే డబ్బులు వస్తాయని భావించి ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్ చేశారు. దీంతో జావీద్ కి ఉత్తర ప్రదేశ్ కి చెందిన గులాం నబి పరిచయం అయ్యాడు. జావీద్ అడిగినట్లుగానే రెండు వాహనాలు సెకెండ్స్ లో నబి తక్కువ రేటుకు ఇన్నోవా కారు నాలుగు లక్షలకు అమ్మేశాడు .. దీంతో ఆ ఇన్నోవా కారును 6 లక్షల 70 వేలు కు సెల్ చేశాడు.. దీంతో ఇనోవా కారు సేల్ చేయగా రూ. 2,70,000 ఆదాయం వచ్చింది. దీంతో నబి కి జావీద్ కు మధ్య పరిచయం ఏర్పడింది.

నా దగ్గర ఖరీదైన ఫార్చూనర్ కారు ఉందని అతి తక్కువ రేటుకు ఇస్తానని చెప్పి జావీద్ కి గులాం నబి 2 లక్షలు అమ్మకాలు చేశాడు.. బ్యాంకు అధికారులు పెట్టిన ఆక్షన్ లో వచ్చిన కారును కొనుగోలు చేశానని నమ్మించాడు. అయితే కారు ఎన్‌ఓసీ కానీ, కారు కి సంబంధించిన పేపర్లు అడగటంతో గులాం నబి నుండి సరైన సమాధానం రాలేదు. దీంతో ఎదో ఒక్క రోజు అసలు నిజం చెప్పాలని భావించి గులాం నబి వాస్తవం చెప్పాడు. నేను దొంగలించిన కారును మీకు అమ్మకం చేశానని, నకిలీ ఎన్‌ఓసీ, కారు డాక్యుమెంట్లు సృష్టియించి వేరే వారికి అమ్మేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇలా రెండు లక్షలు ఫార్చ్యూనర్ కారును 6.5 లక్షలకు అమ్మేశాడు.
ఇలా పదుల సంఖ్యలో దొంగలించిన కారులు ను ఢిల్లీ లోని నబి ద్వారా జావీద్ అతనికి సహాయంగా మహమ్మద్ జహీర్ , అమన్ ఖాన్ ను తీసుకెళ్లి దొంగలించిన కార్లు హైదరాబాద్ లో అమ్మేస్తున్నారు.

ఇలా ఢిల్లీ నుండి దొంగలించబడిన కార్లను బ్యాంకు అధికారులు వేసిన వేలం పాటలో కొనుగోలు చేశామని చెప్పి అమ్మకాలు చేస్తూ మోసం చేస్తుంది ముఠా. కొంత మందికి ఎన్‌ఓసీలు ఇవ్వక పోవడం, అలాగే డాక్యుమెంట్లు అడిగితే ఎదో ఒక సమాధానం చెప్పి దాటవేయడం, ఇంకా ఎక్కువ ఒత్తిడి పెడితే నంబర్స్ ను మార్చేస్తూ ఇలా మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఇక వీరి వద్ద కొనుగోలు చేసిన వారు ఇది దొంగ వాహనం అని తెలుసుకొని భయపడుతూ, బయటకి చెపితే ఏమవుతుందో అని అలాగే వాహనాలు పెట్టుకొని తిరుగుతున్నట్లు తేలింది. దీంతో సైబరాబాద్ లోని శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు వచ్చిన సమాచారంతో దాడులు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా అసలు వాస్తవం బయట పడింది. ఢిల్లీ లో 16 ఎఫ్ఐఆర్‌లు నమోదయినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ముగ్గరు నిందితులు నుండి 15 కార్లు ను సీజ్ చేశారు. అందులో ఇనోవా 2 , క్రెటా 4, బెలెనొ 7, బ్రిజ 2 కార్లు ను సీజ్ చేశారు పోలీసులు .. నిందితులు నలుగురు కూడా వచ్చిన ఆదాయంలో పంచుకుంటున్నారని తెలిపారు. పరారీ లో ఉన్న కీలక నిందితుడు గులాం నబి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.