NTV Telugu Site icon

Thailand: భక్తులతో మలం తినిపిస్తున్న దొంగ బాబా అరెస్ట్

Baba Arrest

Baba Arrest

టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంత మంది ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. ఇలాంటి వాళ్ల కారణంగానే దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. అమాయక ప్రజలే దొంగ బాబాల పెట్టుబడి. అయితే ఈ మూఢ నమ్మకాలు మన దేశానికే పరిమితం కాలేదు. పక్క దేశాలలో కూడా దొంగ బాబాలు చెలామణి అవుతున్నారు. తాజాగా థాయ్‌లాండ్‌లో ఓ దొంగ బాబా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. తన మల, మూత్రాలు ఔషధంలా పనిచేస్తాయని, రోగాలు మాయం చేస్తాయని తావీ నన్రా (75) అనే బాబా ప్రచారం చేస్తున్నాడు. దీంతో ప్రజలు ఆ స్వామిజీ మలమూత్రాలను స్వీకరించేందుకు ఎగబడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

Kerala: కేరళలో కొత్త రకం వైరస్… కంగారు పెడుతున్న టమాటో ఫ్లూ

అయితే పోలీసుల విచారణలో భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్వామిజీ ఆశ్రమంలో 11 శవాలు లభించాయి. వాటిలో 5 శవాలకు మాత్రమే డెత్ సర్టిఫికెట్స్ ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆ శవాలు ఎవరివి, అక్కడ ఎందుకు ఉన్నాయనే అంశాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. దీంతో తావీ నన్రాను తాము అరెస్ట్ చేశామన్నారు. అయితే అతడి మల, మూత్రాలను భక్తులు స్వీకరిస్తున్నారని తెలిసి తమకు చాలా ఆశ్చర్యం వేసిందని.. ఇలాంటివి ఎలా విశ్వసిస్తున్నారో అర్ధం కావడం లేదని అభిప్రాయపడ్డారు. అయితే తమ స్వామి మలం అస్సలు వాసన రాదని, కళంకిత మనస్సున్న వారికే కంపు కొడుతుందని తావీ నన్రా అనుచరులు చెబుతున్నారు.