కూకట్ పల్లి పీఎస్ పరిధిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జార్ఖండ్ వెళ్లిన స్పెషల్ టీం నిందితులను జార్ఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. పోలీసులు టెక్నికల్, ఇతర ఏవిడెన్స్ ఆధారంగా నిందితుల జాడ కనుగొని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ (45)ను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఘటన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం రేణు భర్త, కుమారుడు షాపుకు వెళ్లిపోయారు.
Also Read:Charlie Kirk: భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా.. చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం
సాయంత్రం నుండి రేణు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భర్త ఆందోళన చెందారు. రాత్రి ఏడుగంటల సమయంలో ఇంటికి చేరి, వెనక తలుపు ద్వారా కార్మికునితో తలుపులు తెరిపించారు. ఇంట్లోకి వెళ్లినప్పుడు రేణు అగర్వాల్‌ను హాల్‌లో కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి హత్య చేసిన స్థితిలో కనుగొన్నారు. నెల రోజుల క్రితం హర్షను జార్ఖండ్ నుంచి సహాయకుడిగా తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. హర్ష, పై అంతస్తుల్లో ఉంటున్న రోషన్‌తో స్నేహం పెంచుకున్నాడు. హత్య జరిగిన రోజే సాయంత్రం ఇద్దరూ కలిసి ఒక బ్యాగ్‌తో బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆధారాలు లభించాయి.
