Crime: దొరికితే నలుగురిలో పరువు పోవడంతో పాటుగా శిక్ష పడుతుందని తెలిసీ కొందరు కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొరికితేనే దొంగ దొరికే వరకు దొరనే.. ఒంటరి మహిళల దగ్గర బంగారం దోచుకుంటే వాళ్ళు ఏం చేయలేరులే అనుకున్నారేమో ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి బంగారు గొలుసుల్ని కాచేశారు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే గత కొద్ది రోజులుగా విశాఖలో దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. ఇప్పటికే 11 గోల్డ్ చైన్ స్నాచింగ్ కేసులు నమోదైయ్యాయి. తాజాగా మొత్తం 11 కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో అరెస్ట్ అయిన దొంగల దగ్గర నుండి 18 లక్షల విలువ చేసే 30 తులాల బంగారం.. 3 బైక్స్ స్వాధినం చేసుకున్నారు.
Read also:Selfie Suicide: పామూరులో సెల్పీ సూసైడ్.. వీడియోను బంధువులకు పంపి మరీ..
ఈ నేపథ్యంలో క్రైమ్ డిసిపి నాగన్న మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చైన్ స్నాచర్స్ పట్టుకునేందుకు 360 సిసి కెమెరాలు పరిశీలించామని, దొంగలను పట్టుకునేందుకు తుని వరకు వెళ్ళమని, కాగా దొంగలు పోలీసుల కళ్ళు కప్పి గల్లీలలో తిరిగారని పేర్కొన్నారు. వాళ్ళను పట్టుకునేందుకు 8 టీమ్స్ ఏర్పాటు చేశామని వెల్లడినించిన ఆయన యూట్యాబ్ చూసి చైన్ స్నాచింగ్ ఎలా చేయ్యాలో నేర్చుకున్నారు అని తెలిపారు. కాగా దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్లలో కొందరు సొంత ఇల్లు కట్టుకోవాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నారని.. ఇంకొందరు అత్త మామలు ఇచ్చిన కట్నం రమ్మీ ఆడి పోగొట్టుకోవడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు. కాగా వీళ్ళు దొంగలించిన బంగారం ముత్తుట్, ఆటిక గొల్ట్ కంపెనీలో పెడుతున్నారని తెలిపిన ఆయన.. సరైన ఆధారాలు లేకుండా బంగారం తనకా పెట్టుకుంటే మీరు కూడా బాద్యులే అంటూ కంపెనీలను హెచ్చరించామని తెలిపారు.
