Site icon NTV Telugu

Medak: సహజీవనం చేస్తూ దొంగతనాలు.. లవర్స్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

Theft

Theft

ఏ పని చేయకుండా అవసరాలు తీర్చుకోవడం కోసం దొంగతనాలను ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో చోరీలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ విచిత్ర దొంగల బండారం బయటపడింది. సహజీవనం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగ ప్రేమికులు. ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని చోరీలు చేస్తున్నారు కిలాడి కపుల్స్. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read:Crime News: సరూర్‌నగర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త!

బెట్టింగ్ లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న లవర్స్ ని మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పెంటయ్య(30), వరలక్ష్మి(30) సహజీవనం చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బయట తిరగడానికి కామారెడ్డి జిల్లాలో పల్సర్ బైక్ చోరీ చేసింది ఈ జంట. ఈ నెల 7న గజ్వేల్ బస్టాండ్ లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకున్నారు ప్రియుడు, ప్రియురాలు.

Also Read:Dhanush: ముంబైలో తమిళ్ లో మాట్లాడి షాకిచ్చిన ధనుష్

తర్వాత పరికి బండ వద్ద మహిళకు మద్యం తాగించి మత్తులో దించి ఒంటిపై నగలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో దండుపల్లి వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో దొంగ ప్రేమికులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 1.25 తులాల బంగారం, 50 తులాల వెండి, పల్సర్ బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Exit mobile version