Site icon NTV Telugu

Hyd Girl Death Update: బాలిక సహస్రాణి మర్డర్ మిస్టరీ.. తల్లిదండ్రులను విచారిస్తున్న పోలీసులు

Hyd Girl Sahsrani

Hyd Girl Sahsrani

కూకట్‌పల్లి మైనర్ బాలిక మర్డర్‌ కేసులో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ కేసులో కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో సహస్రాణి తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. సహస్ర పేరెంట్స్ రేణుకా, కృష్ణలను విచారిస్తున్నారు. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యామిలీ హిస్టరీ, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ఇంటి సమీపంలో అనుమానితులు, పాత కక్షలు, కుటుంబ కలహాలు, గొడవలు ఎవరి పైన అయిన అనుమానం ఉందా?

Also Read:Allu Arjun : అల్లు అర్జున్ కు షాక్.. రోజుకు కోటిన్నర నష్టం..?

ఇలా అనేక కోణాల్లో సహస్ర పేరెంట్స్ ను ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. 7 గంటలుగా సహస్ర పేరెంట్స్ ను విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు రోజులు గడుస్తున్న కూకట్‌పల్లి బాలిక హత్య కేసు చిక్కుముడి వీడడం లేదు. సహస్రాణిని హత్య చేసింది ఎవరు? ఎందుకోసం హత్య చేసారు? నిందితుడు ఎక్కడ ? ఇంకా వీడని మిస్టరీ. తెరపైకి అంతుచిక్కని అనుమానాలు.. ఇంట్లోకి ఎవరు ప్రవేశించ లేదు? బాలికను ఇంతకీ మరి ఎవరు హత్య చేశారు? అన్న కోణంలో విచారణ చేస్తు్న్నారు. ఇప్పటి వరకు నలుగురు అనుమానితులను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version