Site icon NTV Telugu

Hyderabad :గచ్చిబౌలి కాల్పుల ఘటనలో కీలక అప్డెట్.. నిందితుడిపై 80 కేసులు..

Hyd

Hyd

గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో కాల్పులు ఘటనపై కీలక విషయాలు వెల్లడయ్యాయి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నటోరియాస్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌పై ఇప్పటికే 80 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మూడు పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో16 కేసులో మోస్ట్ వాంటెడ్‌గా గా ప్రభాకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 2 తుపాకులు 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు ప్రభాకర్.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్ ఎడమ కాలికి గాయమైంది. కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు పబ్ సిబ్బంది గాయాలయ్యాయి. నిందితుడు 2023 నవంబర్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. మొయినాబాద్‌ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రలను పోలీసులు గుర్తించారు.

READ MORE: Budget 2025 : బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రిని చుట్టుముట్టిన ఎంపీలు, ప్రధాని.. ఎందుకంటే ?

ఆ డేటాతో సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతూ.. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అయ్యాడు. ప్రిజం పబ్‌కి తరచూ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పోలీసులు పబ్‌కు వెళ్లారు. ప్రిజం పబ్ లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరామిరెడ్డిపై నిందితుడు కాల్పులు జరిపాడు. పబ్ సిబ్బంది సహాయంతో పోలీసులు ప్రభాకర్ అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: Maha Kumbh: కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం.. ఐదుగురు నేపాలీలు మృతి..

 

Exit mobile version