Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన నిర్వాసితులకు గోకవరం మండలం కొత్తపల్లి ప్రాంతంలో పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా.. దీనిని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు ఇష్టం లేని ప్రాంతంలో పునరావాసం కల్పించవద్దని, తాము కోరుకున్న తాడువాయి ప్రాంతంలోనే పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట సుమారు వెయ్యి మంది నిర్వాసితులు ధర్నా నిర్వహించారు.
కొత్తపల్లి ప్రాంతంలో పునరావాసం కల్పించే ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు స్పష్టం చేశారు. తమ అభ్యర్థనను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, తాడువాయి ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నోక్వాల్ ఆందోళనకారులతో చర్చించి.. వారి డిమాండ్లను ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయితే తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిర్వాసితులు హెచ్చరించారు. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల పునరావాస అంశం మరోసారి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!