ఈ మధ్యకాలంలో కొందరు వారి ఆనందం కోసం ఎదుటివారిని ఇబ్బందులు గురి చేయడం పరిపాటుగా మారిపోయింది. వీడియో వల్ల అమాయకులు కొందరు బలవుతున్నారు. మరికొంతమంది ఆకతాయిలయితే వారి వికృత చేష్టలకు అనేకమంది పసిప్రాణాలు అలాగే ఇతరులు ఇబ్బంది పడిపోతున్నారు. ప్రజలు ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: IPL 2024 SRH: సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. 8 మ్యాచ్ లలోనే..
ఆకతాయి చేసిన వికృత చేష్టలకు తాజాగా ఓ బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్సను అందుకుంటున్నాడు. ఈ విషయం సంబంధించి పోలీసులు తెలిపిన కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన ఓ బాలుడు సరదాగా సాయంత్రం తోటి స్నేహితులతో వాలీబాల్ ఆడడానికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో వాలీబాల్ లో గాలి తగ్గడంతో గాలి నింపుకోవడానికి గాలి పంప్ కోసం సమీపంలోని ఓ గ్రామ సచివాలయం వద్ద ఆడుకుంటున్న కొందరు యువకుల వద్దకి వెళ్లారు. అయితే అక్కడ ఆడుకుంటున్న యువకులలో ఒకరు తాడికొండ రాజా. అతడు బాలుడును పట్టుకొని తన వికృత చేష్టలను మొదలుపెట్టాడు. దీంతో బాలుడుతో పాటు వచ్చిన పిల్లలు అక్కడి నుంచి పరుగులు తీశారు.
Also read: Lok sabha election: నెమ్మదిగా సాగుతున్న ఓటింగ్.. ఒంటి గంట వరకు ఎంతంటే..!
ఈ నేపథ్యంలో తొలికొండ రాజాకు చిక్కిన అబ్బాయికి మలద్వారంలో పంపు పెట్టి గాలిని కొట్టాడు. బాలుడు ఎంతో తీవ్రంగా ఎదరిస్తున్న రాజా వినకుండా బలవంతంగా గాలి కొట్టాడు. దానితో బాలుడు కడుపు ఉబ్బడంతోపాటు ఆ అబ్బాయి మర్మంగాలు కూడా వాచాయి. అయితే ఈ విషయాన్ని మొదట ఇంట్లో చెప్పకుండా బాలుడు సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే ఆ తర్వాత రాత్రి సమయంలో సంఘటనకు సంబంధించి శరీరంలో నొప్పి తీవ్రం కావడంతో బాలుడు విలవిల్లాడి పోయాడు. దాంతో బాలుడు పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ఆ తర్వాత ప్రభుత్వాసుపత్రిలోకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం సదరు బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.