Pocharam Srinivas Reddy : ప్రభుత్వం హామీల అమలులో కాలయాపన చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతోందన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం హామీల అమలు లో కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. సమీక్షలు తప్ప ఫలితాలు లేవని ఆయన అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు దాకా వచ్చాయన్నారు. దరఖాస్తుల పేరిట ప్రజలని ఇబ్బంది పెట్టారని, చేయూత ,రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు అవసరం లేదని దరఖాస్తులు తీసుకున్నారని ఆయన అన్నారు. కాలయాపన కోసమే ట్రంకు పెట్టెల్లో దరఖాస్తులు పెట్టారని, మొత్తానికి ప్రజల మోచేతికి బెల్లం పెట్టి దాట వేసే వైఖరి తో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేదాకా కాల యాపన చేసి ఏడాది దాకా హామీలను ఎగ్గొట్టే ప్రక్రియ నడుస్తోందన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని, కాంగ్రెస్ లో ఎవరు సమర్థులు ఉన్నారని ప్రజలు ఓట్లు వేశారని ప్రశ్నించారు. కార్యకర్తలది తప్పు కాదు నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని అప్పుడే విజయం అధ్యమన్నారు. పార్టీ లో ప్రక్షాళన జరగాలన్నారు. కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ కు 16 పార్లమెంటు సీట్లు రావడం కష్టమేమి కాదని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని సూచించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సమీక్షలు తప్ప ఫలితాలు లేవన్నారు. గృహలక్ష్మి పథకం రద్దు చేశారు ..మరి ఎంపిక చేసిన లబ్ధిదారుల పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరే హామీ అమలు కావడం లేదని, రైతు బంధు ఎవరికీ సరిగ్గా అందలేదు, రైతు రుణమాఫీ గురించి ఊసే లేదని, వడ్లకు బోనస్ ఏది అని ప్రశ్నించారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!