NTV Telugu Site icon

Pocharam Srinivas Reddy : కొత్త బిచ్చగాళ్లకు కేసీఅర్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

కొత్త బిచ్చగాళ్ల కు కేసీఅర్ ను ఎదుర్కొనే దమ్ము లేదంటూ ధ్వజమెత్తారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మీకు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడాలని ఆయన బీజేపీ నేతలకు సవాల్‌ చేశారు. నడిచే వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. పేపర్ లీకేజీ దుర్మార్గమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు.

Also Read : Amit Shah: ప్రజాస్వామ్యం కాదు, రాజవంశమే ప్రమాదంలో ఉంది.. రాహుల్‌పై షా కీలక వ్యాఖ్యలు

దొంగే దొంగ దొంగ అంటున్నారని, ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలే ఎన్నికల్లో బొంద పెడతారని ఆయన నిప్పులు చెరిగారు. భయపడేది లేదని, మీకు 10 మంది ఉంటే మాకు 90 మంది ఉన్నారు గ్రామంలో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దమ్ముంటే అభివృద్ధి లో నిధులు తేవడంలో పోటీ పడాలని, కోట్లాది మంది ఆత్మీయుల ఆశీర్వాదం అండ మాకు ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో రాజులు కత్తులతో యుద్ధాలు చేసే వారని, ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం ఓటుతోనే యుద్ధం చేస్తామన్నారు.

Also Read : Pushpa 2: పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్