Site icon NTV Telugu

Potato Fingers : పొటాటో ఫింగర్స్ ను ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?

Potato Fingers

Potato Fingers

ఆలు తో రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ అయితే ప్రతి ఒక్కరు రకరకాలుగా చేసుకొని తింటున్నారు.. ఆలుతో చేసుకొనే వెరైటీ వంటలలో ఈ పొటాటో ఫింగర్స్ కూడా ఒకటి..ఈ పొటాటో ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ పొటాటో ఫింగర్స్ ను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు.. మరి ఆలస్యం ఎందుకు ఆలస్యం ఈ పింగర్స్ ను ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

ఉడికించిన ఆలు – 2,

ఉప్పు – తగినంత,

కారం – అర టీ స్పూన్,

వాము – అర టీ స్పూన్,

నూనె – డీప్ ప్రైకు సరిపడా,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా,

అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్,

కార్న్ ఫ్లోర్ – ఒక కప్పు..

తయారీ విధానం :

ముందుగా ఉడికించిన ఆలును ఉండలు లేకుండా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.. ముందుగా బంగాళా దుంపలను ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి లేదా తురిమి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె, కార్న్ ఫ్లోర్ తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పొటాటో మిశ్రమాన్ని తీసుకుని ఫింగర్స్ ఆకారంలో చుట్టుకోవాలి. తరువాత వీటిని కార్న్ ఫ్లోర్ తో కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పొటాటో ఫింగర్స్ ను నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి.. వీటిని సిమ్ లో పెట్టి ఎర్రగా క్రీస్పిగా అయ్యేవరకు వేయించాలి.. అంతే టేస్టీ టేస్టీ పొటాటో ఫింగర్స్ రెడీ అయినట్లే.. పిల్లలు ఇష్టంగా తింటారు.. వీటిని సాస్ తో తీసుకుంటే మరింత టేస్ట్ గా ఉంటాయి.. మీరు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version