NTV Telugu Site icon

Modi on Union Budget: కేంద్ర బడ్జెట్ గురించి ప్రధాని మోడీ ఏమన్నారంటే!

Mdi1

Mdi1

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. బడ్జెట్‌లో అనేక ప్రోత్సాహకాలు ప్రకటించామని మోడీ పేర్కొన్నారు. అమృత కాలంలో వస్తున్న మొదటి బడ్జెట్ ఇదేనని.. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి బలమైన పునాదిని నిర్మిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులతో సహా అందరి ఆకాంక్షలను, కలలను నెరవేరుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్‌ భారత అభివృద్ధితోపాటు గొప్ప సంకల్పాన్ని నెరవేరుస్తుందని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించామని.. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు.

Also Read: Union Budget 2023: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే చిన్నది

దేశం కోసం కష్టపడి పనిచేసిన ‘విశ్వకర్మ’ ఈ దేశ సృష్టికర్త అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాంటి విశ్వకర్మల శిక్షణ, సహాయానికి సంబంధించిన పథకాన్ని తొలిసారిగా బడ్జెట్‌లో తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ద్వారా సంపద్రాయ వృత్తుల వారికి చేయూతను అందించనున్నట్లు వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని.. మహిళా స్వయం సహాయక సంఘాలు వారి జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయని చెప్పారు. ఇళ్లలో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రత్యేక పొదుపు పథకం ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.

Also Read: Budget 2023: రైల్వే శాఖకు బడ్జెట్‌ బూస్ట్‌.. రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు

Show comments