Site icon NTV Telugu

PM Modi Rajahmundry Tour: ప్రధాని మోడీ పర్యటన.. ఎల్లుండి రాజమండ్రిలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లు బంద్‌..

Pm Modi

Pm Modi

PM Modi Rajahmundry Tour: సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర నేతలతో పాటు.. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇక, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 6వ తేదీన పర్యటించబోతున్నారు.. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు వేమగిరి జంక్షన్ లోభారీ బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగిస్తారు.. అయితే, మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బందోస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.. మరోవైపు.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు విధించారు పోలీసులు.. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉండనున్నాయి.. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేయనున్నారు..

విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనదారులకు ఆంక్షలు
* గుండుగొలను వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* తాడేపల్లిగూడెం వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
* జొన్నాడ వైపుగా వచ్చే వాహనాలు మండపేట- రామచంద్రపురం- కాకినాడ- కత్తిపూడి మీదుగా వెళ్లాలని సూచించారు.

విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులకు సూచనలు
* కత్తిపూడి వైపుగా వచ్చే వాహనాలు పిఠాపురం- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వైపు వెళ్లాలి..
* జగ్గంపేట మీదగా వెళ్లే వాహనాలు సామర్లకోట- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

జిల్లా పరిసర ప్రాంతాలలో వేమగిరి మీదుగా వచ్చి వెళ్లే వాహనదారులకు కీలక సూచనలు..
* జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- దేవరపల్లి మీదుగా విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది..
* జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- కొవ్వూరు- విజ్జేశ్వరం- పెరవలి- రావులపాలెం మీదగా వెళ్లాలి..
* రాజానగరం- ద్వారపూడి- మండపేట- ఆలమూరు- జొన్నాడ- రావులపాలెం మీదగా వాహనాలు మళ్లించారు.
* వేమగిరి- ధవలేశ్వరం- ఐ.ఎల్.టి.డి జంక్షన్- కోటిపల్లి బస్టాండ్ మీదుగా ట్రాఫిక్‌ మళ్లింపు.
* వేమగిరి- కేశవరం- ద్వారపూడి- మండపేట- రామచంద్రపురం మీదుగా కాకినాడ వైపు వెళ్లాలి..
* పెరవలి జంక్షన్ -సమిశ్ర గూడెం-విజ్జేశ్వరం- కొవ్వూరు- గామన్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని సూచన.

ఇక, పై ట్రాఫిక్ డైవెర్సన్స్ ని రాజమండ్రి పట్టణ , పరిసర ప్రాంత గ్రామ ప్రజలు గమనించి, పోలీసు వారికి సహకరించవలిసినదిగా తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్ పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.. ఈ రూట్లను గమనించకుండా.. వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Exit mobile version