Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Pm Narendra Modi Election Campaign In Ap Today And Traffic Restrictions In Rajahmundry

PM Modi AP Tour: నేడు ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం.. రాజమండ్రిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Date :May 6, 2024 , 7:35 am
By Sudhakar Ravula
PM Modi AP Tour: నేడు ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం.. రాజమండ్రిలో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi AP Tour: సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశాన్ని చుట్టేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.. తూర్పు గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ప్రధాని ప్రచారం కొనసాగనుంది.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో దిగి నేరుగా సభ వేదిక వద్దకు వెళ్లనున్నారు.. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్తారు.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.. భారీగా జన సమీకరణ కోసం ఎన్డీఏ కూటమి పార్టీలు కసరత్తు చేస్తోంది.. ఇక, అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం దగ్గర కూటమి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ సభల్లో పాల్గొననున్నారు.

మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు విధించారు.. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి..

విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలకు.
* గుండుగొలను వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* తాడేపల్లిగూడెం వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి..
* జొన్నాడ వైపుగా వచ్చే వాహనాలు మండపేట- రామచంద్రపురం- కాకినాడ- కత్తిపూడి మీదుగా వెళ్లాలి..

విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు.
* కత్తిపూడి వైపుగా వచ్చే వాహనాలు పిఠాపురం- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లాలని సూచించారు.
* జగ్గంపేట మీదగా వెళ్లే వాహనాలు సామర్లకోట- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లా్ల్సి ఉంటుంది.

జిల్లా పరిసర ప్రాంతాలలో వేమగిరి మీదుగా వచ్చి వెళ్లే వాహనాలకు.
* జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- దేవరపల్లి మీదుగా విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- కొవ్వూరు- విజ్జేశ్వరం- పెరవలి- రావులపాలెం మీదగా వెళ్లవలెను.
* రాజానగరం- ద్వారపూడి- మండపేట- ఆలమూరు- జొన్నాడ- రావులపాలెం మీదగా వెళ్లాలి.
* వేమగిరి- ధవలేశ్వరం- ఐ.ఎల్.టి.డి జంక్షన్- కోటిపల్లి బస్టాండ్ మీదుగా వెళ్లవలెను.
* వేమగిరి- కేశవరం- ద్వారపూడి- మండపేట- రామచంద్రపురం మీదుగా కాకినాడ వెళ్లవలెను..
* పెరవలి జంక్షన్ -సమిశ్ర గూడెం-విజ్జేశ్వరం- కొవ్వూరు- గామన్ బ్రిడ్జి మీద వెళ్లవలెను.

ఇక, పై ట్రాఫిక్ డైవెర్సన్స్ ని రాజమండ్రి పట్టణ , పరిసర ప్రాంత గ్రామ ప్రజలు గమనించి, పోలీసు వారికి సహకరించవలిసినదిగా తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్ పోలీసు శాఖ విజ్ఞప్తి చేశారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anakapally
  • AP Elections 2024
  • chandrababu
  • Election Campaign
  • NDA

తాజావార్తలు

  • Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

  • Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

  • Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

  • Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions