NTV Telugu Site icon

PM Modi: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. ఏపీ వికాస్‌ మోడీ లక్ష్యం..

Modi

Modi

PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో కూడా డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి బహిరంగసభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు.. ఏపీ వికాస్‌ మోడీ లక్ష్యంగా పేర్కొన్నారు.. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ ట్టుకుపోయింది.. మేం వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం అని హెచ్చరించారు. అనేక ఖనిజాలను కలిగి ఉన్న నేల.. రాయలసీమ.. చైతన్యవంతులైన యువత ఉన్న ప్రాంతం.. ఆంధ్రప్రదేశ్ వికాశం.. మోదీ లక్ష్యం అన్నారు. ఇవక, వైసీపీ ప్రభుత్వానికి కౌండౌన్ మొదలైంది.. ఇక్కడ వైసీపీ రౌడీ రాజ్యాన్ని నడుపుతున్నారు.. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు.. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగాలు లేవు.. ఐదేళ్లుగా రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు.. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసిందన్నారు.

Read Also: RBI: రూ. 20,000 నగదు రుణాల పరిమితిని పాటించాలి.. నాన్-బ్యాంక్స్‌కి ఆర్బీఐ ఆదేశం..?

పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కోసం.. వైసీపీ పని చేసిందని ఆరోపించారు ప్రధాని మోడీ.. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నర ఆయన.. మేం వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం అన్నారు. ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్ని రకాలుగా ఆదుకుంటాం.. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా నీళ్లు అందించాలనేది మా లక్ష్యం అన్నారు. కేంద్ర పథకం జల్‍జీవన్ మిషన్‍కు వైసీపీ ప్రభుత్వ సహకారం లేదన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది.. అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమని మండిపడ్డారు.. భారత్.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది.. తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు అని విమర్శించారు.

Read Also: Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

ఇక, నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైను పూర్తయింది – కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం అన్నారు మోడీ.. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం – ఏపీకి బుల్లెట్ రైలు కావాలా..? వద్దా …? అని సభికులను ప్రశ్నించారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తాం.. టామటా నిల్వ కోసం గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం అన్నారు. పులివెందులలో అరటి రైతుల కోసం క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ ఇస్తామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో చేపట్టిన మంచి పనులను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తానని చెబుతోందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు.. రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి తీసుకుంటానని చెబుతోందన్న ఆయన… రామ మందిరానికి తాళం వేస్తానని అంటుందని మండిపడ్డారు.