NTV Telugu Site icon

PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్‌ సిటిజన్లకు ప్రధాని క్షమాపణ..

Pm Modi

Pm Modi

ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి దేవుడైన ధన్వంతరి జయంతి (ధన్‌తేరస్‌) సందర్భంగా రూ.12,850 కోట్లకు పైగా విలువైన వైద్య పథకాలకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ కారణాల వల్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడం లేదని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలను ప్రధాని మోడీ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పథకం కింద ఈ రెండు రాష్ట్రాల్లోని వృద్ధులు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందలేకపోవడం బాధాకరమన్నారు.

READ MORE: Formula E Car Racing: మళ్లీ తెరపైకి ఈ-కార్ రేసింగ్ నిధుల వివాదం..

ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ నేను సేవ చేయలేనందుకు క్షమాపణలు కోరుతున్నాను అని ప్రధాని అన్నారు. మీ బాధ నాకు తెలుసు కానీ నీకు సహాయం చేయలేనని.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకాన్ని అమలు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి అతిషీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు రావడం లేదని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద ఆసుపత్రుల్లో ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది. వారికి ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డు ఇవ్వబడుతుంది. కానీ… ఆయా రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఇది అందనందుకు చింతిస్తున్నానన్నారు.

READ MORE:Triple Talaq: అన్ని మతాలకు ఒకే రూల్.. ట్రిపుల్‌ తలాక్‌ కేసులో మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు