ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సభ్యత్వ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సమయంలో.. ప్రధాని మోడీ బీజేపీలో మరోసారి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశప్రజల ఆకాంక్షలకు కొత్త పుంతలు తొక్కాలని నిర్ణయించుకున్నామన్నారు. నేషనల్ మెంబర్‌షిప్ క్యాంపెయిన్ 2024ని ప్రారంభించడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. దేశం ముందున్న స్ఫూర్తితో పని చేస్తున్నామన్నారు. పార్టీ ఎన్నో భరించి ఇక్కడికి చేరుకుందని గుర్తు చేశారు. ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు సాగిందని తెలిపారు.
READ MORE: Minister Nimmala Ramanaidu: కృష్ణా నదిలో ఇదే రికార్డు ఫ్లడ్.. అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు..
రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య ప్రక్రియలను అక్షర, స్ఫూర్తితో పాటిస్తూ, సామాన్యుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతరం సన్నద్ధమవుతున్న ఏకైక పార్టీ బీజేపీయేనని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ్టి నుంచి మరో దఫా సభ్యత్వ ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భారతీయ జనసంఘ్ నుంచి ఇప్పటివరకు, దేశంలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావడానికి పార్టీ సాయశక్తులా కృషి చేసిందన్నారు. దేశంలోని ప్రజలు అధికారాన్ని అప్పగించే సంస్థ లేదా రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువలతో ముందుకు సాగాలన్నారు.