NTV Telugu Site icon

Gujarat: నేడు గుజరాత్ లో యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ రోడ్ షో..

Modi

Modi

రేపు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో-2024ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రధాన మంత్రితో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమవుతారని అధికారులు తెలిపారు.

Read Also: Astrology: జనవరి 09, మంగళవారం దినఫలాలు

కాగా, విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన తర్వాత సాయంత్రం మూడు కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగుతుందని అహ్మదాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ సఫిన్ హసన్ తెలిపారు. అహ్మదాబాద్‌ను గాంధీనగర్‌ను కలిపే ఇందిరా వంతెన దగ్గర రోడ్‌షో ముగుస్తుంది అని చెప్పారు. బ్రిడ్జి సర్కిల్ నుంచి గాంధీనగర్‌లోని వారి వారి గమ్యస్థానాలకు నేతలిద్దరూ బయలుదేరుతారన్నారు.

Read Also: Gastric Problem: చలికాలంలో గ్యాస్ ఎక్కువగా పడుతుందా? ఈ డ్రింక్ ను ఉదయాన్నే తాగారంటే..

అయితే, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. రేపు (బుధవారం) గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో వీజీజీఎస్ 10వ ఎడిషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జనవరి 8 నుంచి 10 వరకు గుజరాత్‌లో తన మూడు రోజుల పర్యటన సందర్భంగా ప్రపంచ నాయకులతో పాటు అగ్రశ్రేణి సంస్థల సీఈఓలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

Read Also: Sankranti Holidays: ఏపీలో నేటి నుంచి సంక్రాంతి సెలవులు

ఇక, వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమం యొక్క థీమ్ ‘గేట్‌వే టు ది ఫ్యూచర్’గా తెలిపారు.. ఈ ఎడిషన్ ’20 సంవత్సరాల వైబ్రెంట్ గుజరాత్ విజయానికి పరాకాష్ట’గా జరుపుకుంటుంది. ఈ ఏడాది సమ్మిట్‌లో 34 భాగస్వామ్య దేశాలతో పాటు 16 భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. ఈ సారి, ఈశాన్య ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించడానికి ఈ ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ వైబ్రంట్ గుజరాత్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రస్తావించే అవకాశం ఉంది.