Site icon NTV Telugu

Uttarakhand: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్‌ 2న మోడీ సభ!

Modi

Modi

రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్- ఉధమ్ సింగ్ నగర్ లోక్‌ సభ నియోజకవర్గం రుద్రాపూర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య కొఠారి ప్రధాని మోడీ బహిరంగ సభకు సంబంధించిన షెడ్యూల్‌ వివరాలను తెలియజేశారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు బీజేపీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది.

Read Also: Exit Polls: జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేదం: ఈసీ

అయితే, ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రుద్రపూర్‌లో ప్రధాని బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే రోజు జైపూర్ రూరల్‌లోనూ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఏప్రిల్ 3వ తేదీన పితోర్‌గఢ్‌, వికాస్‌నగర్‌లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ప్రచారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యం వహిస్తున్నారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీలు కూడా పలు రాష్ట్రాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు.

Exit mobile version