PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Vijayadashami Speech: దేశ గౌరవానికి భంగం కలిగించే శక్తులు, సమాజాన్ని విభజించే వ్యక్తులు, భారతీయ సంస్కృతిని ద్వేషించే మనస్తత్వం కలిగిన వారే దేశ శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతమాత శత్రువులను గుర్తించి వారిని ఓడించాలని, ‘దేశమే ప్రథమం’ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా ఢిల్లీలోని ఐపీ ఎక్స్టెన్షన్లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘సియావర్ రామచంద్ర కీ జై’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. భారతీయ సంస్కృతి, మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా శ్రీరాముడిని ఆరాధిస్తున్నారని చెప్పారు. రావణుడిని సంహరించినందుకు మాత్రమే కాకుండా మానవాళికి అమూల్యమైన ఆదర్శాలను అందించినందుకు శ్రీరాముడిని పూజిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీరాముడు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ సత్యం, ధర్మం మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదని ప్రధాని అన్నారు. రాజ్యాధికారం దక్కుతుందన్న ఆనందం కానీ, వనవాసానికి వెళ్లాల్సి వచ్చిందన్న బాధ కానీ ఆయనను ప్రభావితం చేయలేదన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని నిలబెట్టారని చెప్పారు. వనవాసం అనంతరం అయోధ్యకు తిరిగివచ్చిన శ్రీరాముడు ఏర్పాటు చేసిన ‘రామరాజ్యం’ నేటికీ సుపరిపాలనకు ప్రమాణంగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఎవరి పట్ల వివక్ష లేకుండా అందరికీ న్యాయం, సమాన అవకాశాలు లభించడం, అధికారానికి ప్రజలపై పాలించడం కాకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉండటమే రామరాజ్యమని వివరించారు.
Also Read
ఈ సందర్భంగా గోస్వామి తులసీదాస్ చెప్పిన మాటలను ప్రధాని గుర్తుచేశారు. ప్రజలను జనార్దనులుగా భావిస్తూ ‘నాగరిక దేవో భవః’ అనే మంత్రంతో ముందుకు సాగాలని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సేవకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శ్రీరాముడి జీవితం నుంచి మరో ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలని మోదీ పేర్కొన్నారు. సంక్షోభం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా ఇతరులపై ఆధారపడి ఉండకుండా మన సామర్థ్యాన్ని గుర్తించాలని చెప్పారు. మన వనరులపై విశ్వాసం ఉంచి, సంకల్పాన్ని శక్తిగా మార్చుకుని కృషితో పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. సముద్రం అడ్డుగా ఉన్నా, లంక దూరంగా ఉన్నా శ్రీరాముడి సంకల్పం చెక్కుచెదరలేదని ప్రధాని అన్నారు. ప్రజల సమష్టి శక్తిని కూడగట్టి, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని అసాధ్యంగా కనిపించిన లక్ష్యాన్ని సాధ్యం చేశారని చెప్పారు. సొంత శక్తిపై విశ్వాసం, సామర్థ్యంపై నమ్మకం, వనరుల సరైన వినియోగం, లక్ష్యం పట్ల అచంచల సంకల్పమే విజయానికి మూలమంత్రమని పేర్కొన్నారు.
దేశం ముందు ‘వికసిత్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలు ఉన్నాయని మోదీ చెప్పారు. ప్రజాశక్తితో ప్రజా సంక్షేమాన్ని సాధిస్తూ ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసే శక్తులు, సమాజాన్ని విభజించే వ్యక్తులు, భారతీయ సంస్కృతిని ద్వేషించే మనస్తత్వం దేశానికి శత్రువులని ప్రధాని పేర్కొన్నారు. అలాంటి శక్తులను ఎదుర్కోవడానికి దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. విజయదశమి సందర్భంగా దేశ ప్రజలు తమ సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతమాత శత్రువులను గుర్తించి వారిని ఓడించాలని, ‘రాష్ట్ర ప్రథమ్’ సంకల్పంతో అందరూ ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సమయంలో చేసిన ‘రాముడి నుంచి రాష్ట్రం.. దేవుడి నుంచి దేశం’ అనే సంకల్పాన్ని తప్పకుండా సాకారం చేస్తామని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
#WATCH | Delhi: Ravan Dahan is being performed at IP Extension in East Delhi on the occasion of #Dussehra.
PM Narendra Modi attended the Dussehra celebrations here.
(Source: DD News) https://t.co/ODKvGqvmj1
— ANI (@ANI) October 20, 2026
తాజావార్తలు
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!