Site icon NTV Telugu

PM Modi US Visit: అమెరికా పర్యటన చివరి రోజు.. CEOలతో సమావేశం కానున్న మోడీ

Joe Biden

Joe Biden

PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల అమెరికా పర్యటనకు నేడు చివరి రోజు. ఈరోజు వాషింగ్టన్ డీసీలో భారత, అమెరికా వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని భారతీయ ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో నిన్న జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భారత్ అంతరిక్షం, రక్షణ, సాంకేతికత బదిలీ వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేసింది.

Read Also:Asaduddin Owaisi: నేను నిజం మాట్లాడినందుకే విపక్షాల సమావేశానికి నన్ను పిలవలేదు

వాషింగ్టన్ డిసిలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ప్రధాని మోడీ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. దీని తర్వాత కెన్నెడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో వ్యాపారవేత్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. దీని తర్వాత కెన్నెడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో వ్యాపార ప్రముఖులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. FedEx, MasterCard, Adobeతో సహా US అగ్రశ్రేణి కంపెనీల అధిపతులు, Tech Mahindra, Mastec వంటి భారతీయ కంపెనీలు ఈ ఈవెంట్‌లో 1,200 మంది పాల్గొనే అవకాశం ఉంది.

Read Also:Megastar: ఆరోజు వెయ్యి మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు.. చిరంజీవి కీలక ప్రకటన

సాయంత్రం వాషింగ్టన్ DCలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (USICF) ఏర్పాటు చేసిన భారతీయ కమ్యూనిటీ రిసెప్షన్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారత్‌, అమెరికాల మధ్య ఫైటర్‌ జెట్‌ ఇంజన్లు, అంతరిక్ష సహకారంపై పెద్ద ఒప్పందాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ నిన్న వైట్‌హౌస్ లాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో లాన్‌లో భారతీయ సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్-అమెరికా ఆర్థిక సంబంధాలు పురోగమిస్తున్నాయని జో బిడెన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ రోజు ఇరు దేశాల చరిత్రలో కొత్త అధ్యాయం జోడించబడిందని ప్రధాని మోడీ అన్నారు. రాత్రి, US అధ్యక్షుడు జో బిడెన్ PM మోడీ గౌరవార్థం ఒక గ్రాండ్ స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి Google చీఫ్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లతో సహా 400 మంది అతిథులు హాజరయ్యారు.

Exit mobile version