NTV Telugu Site icon

PM Modi: అబుదాబిలో మోడీ టూర్ విశేషాలు ఇవే

Modi Abu Dabui

Modi Abu Dabui

ప్రధాని మోడీ (PM Modi) అబుదాబి (Abu Dhabi)లో పర్యటిస్తున్నారు. అంతకముందు విమానాశ్రయంలో ప్రధాని మోడీకి యూఏఈ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఘనస్వాగతం పలికారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ యూఏఈకి (UAE) వెళ్లారు. పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు.

ఇరు దేశాల అధికారులతో చర్యల అనంతరం అబుదాబిలోని ఓ హోటల్‌లో భారతీయులతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడ ఉన్న భారతీయ ప్రవాస సభ్యులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ఫొటో దిగారు.

ఇదిలా ఉంటే అబుదాబిలో నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించనున్నారు. యూఏఈలో ఇదే తొలి హిందూ దేవాలయం కావడం విశేషం. బుధవారం ప్రధాని చేతుల మీదు ఈ హిందూ దేవాలయం ప్రారంభం కానుంది.

మరోవైపు అబుదాబిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహంలో చాలా కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాల ఎఫెక్ట్ మోడీ టూర్‌పై పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.