ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా దేశాలను సందర్శిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ జపాన్ పర్యటన లక్ష్యం కాగా, చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆగస్టు 30న ప్రధాని మోదీ జపాన్‌కు బయలుదేరి వెళ్తారు, అక్కడ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై చర్చించే అవకాశం ఉంది.
Also Read:Mohammad Siraj: ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ మియాకు కెరీర్ బెస్ట్
దీని తర్వాత, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాంజిన్ నగరంలో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. 2019 తర్వాత ప్రధాని మోడీ చైనాకు ఇది తొలి పర్యటన అవుతుంది. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వాణిజ్య సహకారం, బహుపాక్షిక సహకారం వంటి ముఖ్యమైన అంశాలపై SCO సమావేశంలో చర్చించనున్నారు.
Also Read:Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్
రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం బ్రిక్స్ దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో, బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ఆరోపిస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఈ పర్యటన ఆసక్తిగా మారింది. ఈ పరిస్థితిలో, ప్రధాని మోడీ ఈ పర్యటన వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. జూన్ ప్రారంభంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలోని కింగ్‌డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లతో అనధికారిక సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
