NTV Telugu Site icon

PM Modi: రెండో రోజు తమిళనాడులో ప్రధాని పర్యటన.. శ్రీరంగం, రామేశ్వరంకు మోడీ..

Modi

Modi

Tamil Nadu: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం నాడు వెళ్లారు. కాగా, నేడు తిరుచిరాప‌ల్లిలోని శ్రీ రంగ‌నాథ స్వామి ఆయ‌లంలో ఆయ‌న పూజ‌లు చేయబోతున్నారు. ఆ త‌ర్వాత ప్రధాని రామేశ్వరం చేరుకోనున్నారు. అక్కడ కూడా ఆయన ప్రత్యేక పూజలో పాల్గొంటారు. శ్రీరంగం స్కాల‌ర్స్ పాడ‌నున్న కంబ రామాయణం భ‌జ‌న‌ల‌ను ఆల‌కించ‌నున్నారు. ఇక, ఇవాళ మ‌ధ్యాహ్నం రామేశ్వరం చేరుకోనున్న ప్రధాని.. స్వామివారి దర్శనం, అభిషేక పూజలో పాల్గొంటారు.

Read Also: MLA Pendem Dorababu: పుట్టిన రోజు వేడుకల తర్వాత సైలెంట్‌ అయిన వైసీపీ ఎమ్మెల్యే..

శ్రీరంగం, రామేశ్వరం ఆలయాలకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండటంతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. శ్రీరంగ ఆలయాన్ని భూలోక వైకుంఠంగా భక్తులు భావిస్తారు. అయితే, జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్యలోని శ్రీ రామ మందిరంను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోడీ పలు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు.