Rozgar Mela: రానున్నది జాబుల జాతర.. మోదీ చేతుల మీదుగా ముహూర్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rozgar Mela: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని నిరూపించుకోబోతోంది. దేశ వ్యాప్తంగా పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అక్టోబర్ 22న ముహూర్తం నిర్ణయించింది. ఆ రోజు ప్రధాని మోడీ కొత్త పథకాన్ని లాంచ్ చేయనున్నారు. రోజ్ గార్ మేళాను ప్రారంభించనున్నారు. తొలివిడుత ఏకంగా 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగంలో చేరనున్న సిబ్బందిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని పీఎంఓ ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా చేరేవారు కూడా దేశవ్యాప్తంగా మొత్తం 38 భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్స్‌లో చేరనున్నారని పీఎంఓ తెలిపింది. ఇందులో గ్రూప్- ఏ, గ్రూప్- బి (గెజిటెడ్), గ్రూప్- బి (నాన్- గెజిటెడ్), గ్రూప్- సి కేటగిరీలు ఉన్నాయని వెల్లడించింది. వీటిల్లోనే కేంద్ర రక్షణ బలగాల సిబ్బంది, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎల్ డీసీ, స్టెనో, పీఏ, ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్స్, ఎంటీఎస్ ఇతరులు కూడా ఉండనున్నట్లు వెల్లడించింది. కొత్త ఉద్యోగులను నేరుగా నియమించుకోవడం లేదా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏజెన్సీల ద్వారా నియమించడం జరుగుతుందని పీఎంఓ వివరించింది.
Read Also: Rishi Sunak: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. అందరి చూపు రిషి సునాక్ వైపే?
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్‌నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
అంతకుముందు జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో మానవ వనరుల మంత్రిత్వ శాఖతో సమావేశమయ్యారు. అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రానున్న ఏడాదిన్నరలోగా.. అంటే 2023 పూర్తయ్యేలోగా ఏకంగా 10 లక్షల మంది ఉద్యోగులను.. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నియమించుకోనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇప్పటికే గ్రూప్-ఏలో (గెజిటెడ్) 23,584 పోస్టులు, గ్రూప్- బిలో (గెజిటెడ్) 26,282, గ్రూప్-బిలో (నాన్- గెజిటెడ్) 92 వేల525, గ్రూప్- సి (నాన్- గెజిటెడ్) లో 8.36 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం రక్షణ శాఖ పరిధిలోనే గ్రూప్- బి నాన్ గెజిటెడ్ కింద 39 వేలకుపైగా, గ్రూప్- సి కింద 2.14 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉంది. రైల్వేలో 2.91 లక్షల గ్రూప్- సి పోస్టులు, ఎంహెచ్ఏలో 1.21 లక్షల గ్రూప్- సి (నాన్- గెజిటెడ్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!