NTV Telugu Site icon

PM Modi Kashmir Visit: నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోడీ పర్యటన..

Modi

Modi

PM Modi Kashmir Visit: నేడు ( గురువారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ అండ్ కశ్మీర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, జమ్మూ-కశ్మీర్‎లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు ఆయన చేయనున్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ఓపెనింగ్ చేస్తారని పీఎంఓ తెలిపింది. అలాగే, రేపు (జూన్ 21న) ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇక, జమ్ము, కశ్మీర్ అభివృద్దితో పాటు తన పర్యటనకు సంబంధించిన అంశాలపై ప్రసంగిచే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సామూహిక యోగా సెషన్‎లో పాల్గొని యోగా యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేయనున్నారు.

Read Also: Kalki 2898 AD : ఆ మూడు ప్రపంచాల మధ్య యుద్ధమే కల్కి కథ : నాగ్ అశ్విన్

కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2015 నుంచి ఢిల్లీలోని కర్తవ్య పథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు లాంటి మహానగరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా యువతకు సాధికారత కల్పించడంతో పాటు జమ్మూ కశ్మీర్ ను అభివృద్ది చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాశ్మీర్ పురోగతికి తోర్పడేలా అక్కడి యువతతో నేరుగా మోడీ సంభాషించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే 84 మేజ‌ర్ డెవ‌లెవ‌మెంట్ ప్రాజెక్ట్‌ల‌ను ప్రధాని మోడీ శంకుస్థాప‌న చేయ‌బోతున్నారు.

Read Also: USA vs SA: అమెరికాపై అతి కష్టంగా గెలిచిన దక్షిణాఫ్రికా!

ఇక, 1,500 కోట్ల రూపాయలతో రోడ్డు, మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా పథకాలు, ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పారిశ్రామిక ఎస్టేట్‌ల అభివృద్ధి ఇలా అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు. అలాగే జమ్మూ కశ్మీర్‎లోని 20 జిల్లాల్లోని 15 లక్షల మందికి ఉపాధి చేకూర్చేలా 1,800 కోట్ల రూపాయలతో బృహత్తరమైన మరికొన్ని కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే, ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన 2000 మందికి పైగా ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను అందించనున్నారు.