NTV Telugu Site icon

Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించనున్న ప్రధాని

Cherlapally Railway Termina

Cherlapally Railway Termina

నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. రూ.430 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఈ కొత్త టెర్మినల్ రూపుదిద్దుకుంది. 9 ప్లాట్ ఫామ్‌లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలెటర్లు, 2 విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో పాత రైల్వే స్టేషన్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా చర్లపల్లి స్టేషన్‌ను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం..

Read Also: Vishal : మాట్లాడలేని స్థితిలో విశాల్.. అసలేమైంది..?

ప్రారంభానికి ముందే చర్లపల్లి టెర్మినల్ నుంచి టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 18 నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఆర్టీసీ, ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులో ఉంచుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో 26 ట్రైన్ల ఆపరేషన్ ఉంటుంది. భవిష్యత్తులో 30 పైగా ట్రైన్లు టెర్మినల్ నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read Also: href=”https://ntvtelugu.com/national-news/customes-officers-seized-drugs-in-delhi-airport-737156.html”>Drugs: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

Show comments