NTV Telugu Site icon

DG-IG Conference: జైపూర్‌లో నేటి నుంచి డీజీ-ఐజీ సదస్సు.. పాల్గొననున్న ప్రధాని మోడీ, అమిత్ షా

Dg Ig Program

Dg Ig Program

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల ముఖ్య సమావేశం జరగబోతోంది. దీంతో జైపూర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించారు. నేటి సాయంత్రం జరిగే డీజీ-ఐజీ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా జైపూర్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి వీవీఐపీలు ఈ సదస్సుకు వస్తుండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read Also: Kesineni Nani: ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తి.. పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు..!

అలాగే, ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల డీజీలు, ఐజీలు పాల్గొంటున్నారు. దీంతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల ఐజీ పోలీసులు కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. అయితే, ఈ సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రతపై మేధోమథనంతో పాటు కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌పై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మహామంథన్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) స్థాయికి చెందిన 250 మంది ఉన్నతాధికారులు పాల్గొంటారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పోలీసులు ఆన్‌లైన్‌లో పాల్గొనబోతున్నారు.