Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీకి నమీబియా పార్లమెంట్ “స్టాండింగ్ ఓవేషన్”.. వీడియో చూడండి..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా, బుధవారం ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ దేశానికి మోడీతో కలిపి ముగ్గురు భారత ప్రధానులు మాత్రమే వెళ్లారు. ప్రధానికి నమీబియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రదానం చేసింది.

పర్యటనలో భాగంగా ప్రధాని నమీబియా పార్లమెంట్‌ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు, నమీబియా పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోడీ రాకతో ‘‘స్టాండింగ్ ఓవేషన్’’తో స్వాగతం పలికారు. తమ చప్పట్లతో సాదరంగా పార్లమెంట్‌లోకి ఆహ్వానించారు. 27 ఏళ్లలో ఒక భారతదేశ ప్రధాని నమీబియాను సందర్శించడం ఇదే మొదటిసారి.

Read Also: Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్.. లక్ష ప్రోత్సాహకం! వీడియో వైరల్

నమీబియా పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఇరు దేశాల సంబంధాలను హైలెట్ చేశారు. మీ స్వాతంత్ర్యంతో భారత్ మీ వెంట నిలబడిందని, భారత్ ఐక్యరాజ్యసమితిలో నైరుతి ఆఫ్రికా సమస్యని లేవనెత్తిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. నమీబియా మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం కూడా ఒక పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన మహిళ దేశానికి అధ్యక్షురాలు అయిన విషయాన్ని చెప్పారు. పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తిని మూడుసార్లు దేశానికి ప్రధాని అయ్యేలా చేసిన ఘటన రాజ్యాంగానిది అని కొనియాడారు.

2027 క్రికెట్ వరల్డ్ కప్‌కి సహ ఆతిథ్యం ఇస్తున్న నమీబియా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. మనం పోటీ పడటానికి కాదు, సహకరించడానికి ప్రయత్నిస్తున్నామని, భారత్ ఆఫ్రికా పారిశ్రామీకరణ కోసం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. పవర్ ద్వారా కాకుండా భాగస్వామ్యం ద్వారా నిర్వచించిన భవిష్యత్తును నిర్మిద్దామని, ఆధిపత్యం ద్వారా కాదు, సంభాషన ద్వారా కలిసి అభివృద్ధి చెందుదామని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో చాలా మంది వ్యాక్సిన్స్ ఇవ్వడానికి నిరాకరించిన సమయంలో కూడా, భారత్ వ్యాక్సిన్లు, మందులు ఇచ్చిందని గుర్తు చేశారు. నమీబియా ఆరోగ్యరంగం కోసం కీలక పరికరాలు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని చెప్పారు.

Exit mobile version