Site icon NTV Telugu

Iran Israel Conflict: ఇరాన్ అధ్యక్షుడుతో ఫోన్‌లో మాట్లాడిన పీఎం మోడీ.. కీలక సూచన

Modi

Modi

ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం చాలా ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ఆదివారం ఉదయం, అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా చర్య తర్వాత, ప్రపంచంలో కలకలం రేగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ‘నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము. సైనిక వివాదంపై నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను. ఉద్రిక్తతలను తగ్గించుకుని శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చాను. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలని సూచించానని తెలిపారు.

Also Read:Vikarabad: అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. పెద్ద ఎత్తున ఆందోళన..

ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఆదివారం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఖండించారు, ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. Xలో పోస్ట్ చేసిన ఒక బలమైన పదజాలంతో కూడిన ప్రకటనలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన అమెరికా అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా “నేరపూరిత ప్రవర్తన” కలిగి ఉందని అరఘ్చి ఆరోపించారు. “ఈ ఉదయం జరిగిన సంఘటనలు రెచ్చగొట్టేవి, దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉంటాయి” అని ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read:OPPO A5 5G: మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో విడుదలైన ఒప్పో A5..!

ఈ అత్యంత ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన, నేరపూరిత ప్రవర్తన గురించి ఐక్యరాజ్యసమితిలోని ప్రతి సభ్యుడు ఆందోళన చెందాలి. ‘ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని నిబంధనలను ఉటంకిస్తూ, ఇరాన్ తన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఆప్షన్స్ కలిగి ఉందని అరాఘ్చి తెలిపారు. తక్షణ చర్య తీసుకోవాలని UN భద్రతా మండలి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)ను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.

Exit mobile version