NTV Telugu Site icon

Modi-Kharge: మల్లికార్జున ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్.. ఏమన్నారంటే?

Pm Modi

Pm Modi

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించింది. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు. వేదికపై ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోబోగా.. ఆయన పక్కనున్న భద్రతా సిబ్బంది, వేదికపై ఉన్న ఇతర కాంగ్రెస్ నాయకులు సకాలంలో ఆయన దగ్గరకు వెళ్లి పట్టుకున్నారు. మంచి నీళ్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని కొంతసేపు నిలిపివేశారు.

READ MORE: Railway Recruitment: 14 వేలకు పైగా పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ పున: ప్రారంభం..

కోలుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ.. ” నేను ఎనభైలలో ఉన్నాను. ఇప్పుడే మరణించను. ప్రధాని మోడీని అధికారం నుంచి దించే వరకు బతికే ఉంటాను. ఖర్గేకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా.. ఈ ఘటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖర్గేకు ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఖర్గే త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తన ఆరోగ్యం గురించి ఖర్గే మోడీకి వివరించినట్లు సమాచారం.

Show comments