NTV Telugu Site icon

Paris Paralympics: భారత పారాలింపిక్ పతక విజేతలతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని..

Pm Modi

Pm Modi

పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోఢీ ఆదివారం ఫోన్‌లో మాట్లాడి వారి కృషిని అభినందించారు. అథ్లెట్లు మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్ మరియు రుబీనా ఫ్రాన్సిస్‌లతో ప్రధాని మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు. వారు తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. అవని లేఖరా తన ఇతర ప్రయత్నాలలో విజయం సాధించాలని మోడీ ఆకాంక్షించారు. అవనీ మరో పోటీలో పాల్గొన్నందున ప్రధానితో ఫోన్‌లో మాట్లాడలేకపోయింది.

Read Also: Samit Dravid: అండర్-19కి ఎంపికయ్యాడు కానీ.. ప్రపంచకప్‌కు ‘అనర్హుడు’ ఎందుకో తెలుసా..?

భారత్‌కు ఇప్పటి వరకు ఐదు పతకాలు లభించాయి. అందులో ఒక బంగారు పతకం కూడా ఉంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో అవని లేఖరా భారత్‌కు బంగారు పతకాన్ని సాధించింది. మోనా అదే ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. మరోవైపు.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అంతేకాకుండా.. మహిళల 100 మీటర్ల T35 ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకోగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

Read Also: Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఇది.. షాప్ ఓపెన్ తర్వాత 30 నిమిషాల్లోనే లూటీ.. వీడియో వైరల్..